ఉధృతంగా ప్రవహిస్తున్న బిక్కేరు వాగు

అప్రమత్తంగా ఉండాలి.. చేపల వేటకు వెళ్లొద్దు
కలెక్టర్ హనుమంతరావు

ఆంధ్రప్రభ, ప్రతినిధి /యాదాద్రి : జిల్లాలో భారీ వర్షాలు (the rains) కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హనుమంతరావు (Collector Hanumantha Rao) తెలిపారు. శుక్రవారం జిల్లాలోని ఆత్మకూరు (Atmakur) మండల కేంద్రం నుంచి మొరిపిరాల గ్రామాల (Moripirala villages) మధ్యలో ప్రవహిస్తున్న బిక్కేరు వాగు (Bikkeru stream)ను పరిశీలించారు. లోలెవల్ కాజ్‌వే పై నుంచి బిక్కేరు వాగు వరద ఉధృతంగా ప్రవహిస్తున్నందున ప్రజలు ఎవ‌రూ కూడా వాగు దాటడానికి ప్రయత్నం చేయవద్దని, సెల్ఫీలు ఫొటోలు దిగడానికి వెళ్లకూడదన్నారు. మత్స్యకారులు (fishermen) చేపల వేటకు కూడా వెళ్లకూడదని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ప్రజలు బయటికి రావాలని కోరారు.

ఉరుములు, మెరుపులు వచ్చినప్పుడు చెట్ల దగ్గర ఉండకూడదని తెలిపారు. స్థానికులు ఎవరు కూడా వాగు దాటకుండా ఇరువైపులా పోలీసు బందోబస్తు (police security) ఏర్పాటు చేయాలని డీసీపీ ఆకాంక్ష్ యాదవ్ (DCP Akanksh Yadav)కి ఫోన్ ద్వారా సూచనలు చేశారు. కొలనుపాక (Kolanupaka)లో కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఇండ్లలోకి వరద నీరు వచ్చి ప్రజలు ఇబ్బంది పడుతుండటంతో స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య (Beerla Ailaiah)తో కలిసి ప్రభుత్వ యంత్రాంగం సహాయక చర్యలను చేపట్టిందని చెప్పారు. నీరు నిలిచిన చోట ఆయిల్ బాల్స్ వేయాలన్నారు. దోమల వ్యాప్తి చెందకుండా ఉండేందుకు నివారణకు ఫాగింగ్ చేయాలన్నారు. ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని హెల్త్ క్యాంపులు నిర్వహించాలన్నారు. విష జ్వరాలు, డయేరియా బారిన పడకుండా ముందస్తుగా హెల్త్ క్యాంపు నిర్వహించాలన్నారు.

Leave a Reply