బిక్కనూర్, ఆంధ్రప్రభ : అభివృద్ధిలో బిక్కనూర్ గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని సర్పంచ్ అభ్యర్థి బండి చంద్రకళ రాములు అన్నారు. సర్పంచ్ పదవికి నామినేషన్ వేసిన ఆమె ప్రచారాన్ని ముమ్మరం చేశారు. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఆశీస్సులతో సర్పంచ్‌గా పోటీ చేస్తున్నట్లు తెలిపారు.
తమను ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె కోరారు. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందిస్తానని హామీ ఇచ్చారు. గతంలో ఎంపీటీసీగా తమ వార్డును అభివృద్ధి చేశానని ఈసారి అవకాశమిస్తే బిక్కనూర్ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా అభివృద్ధి చేస్తానని చెప్పారు.

