Bikkanoor | ఫంక్షనల్ అక్రమాలపై విచారణ జరపాలి…

Bikkanoor | బిక్కనూర్, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని ఎస్ వీ గార్డెన్ ఫంక్షన్ హాల్ అక్రమాలపై వెంటనే విచారణ జరపాలని పట్టణ సచివాలయ వార్డు సభ్యులు కర్రోళ్ల రాజు, గజ్జ వేణు కోరారు. ఈ సందర్భంగా మంగళవారం సచివాలయ కార్యదర్శి మహేష్ గౌడ్ కు వినతి పత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ.. మండల కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా ఫంక్షన్ హాల్ నిర్మించారని తెలిపారు. ప్రభుత్వానికి చెల్లించవలసిన పనులు చెల్లించడం లేదని చెప్పారు తక్కువ వైశాల్యం చూపి అధిక విస్తీర్ణంలో ఫంక్షనల్ హాల్ నిర్మించారని పేర్కొన్నారు. ఫంక్షన్ హాల్ పై విచారణ జరిపి యజమానులపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
