biggboss9fame | మరో వివాదంలో మాధురి..

biggboss9fame | మరో వివాదంలో మాధురి..

biggboss9fame | మాధురి మరోసారి అత్యుత్సాహం

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : తిరుమలలో మరోసారి వివాదాస్పద ఘటన చోటుచేసుకుంది. సోషల్ మీడియాలో తరచూ వార్తల్లో నిలిచే దివ్వెల మాధురి మరోసారి అత్యుత్సాహం ప్రదర్శించింది.

ఏడుకొండలపై ఉన్న గెస్ట్ హౌస్‌లో బిగ్ బాస్ ఫేమ్ తనూజ బర్త్‌డే వేడుకలు నిర్వహించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆలయ పవిత్రతను దృష్టిలో ఉంచుకుని తిరుమలలో వ్యక్తిగత వేడుకలు నిర్వహించడం పట్ల ఇప్పటికే పలు నిబంధనలు ఉన్నప్పటికీ, ఈ వేడుకలు జరపడం పట్ల భక్తుల నుంచి ఆగ్రహం, విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం మరింత వివాదంగా మారింది. తిరుమలలో ఇలాంటి చర్యలపై టీటీడీ అధికారులు స్పందిస్తారా? చర్యలు తీసుకుంటారా? అనే అంశంపై భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

biggboss9fame
biggboss9fame

biggboss9fame
biggboss9fame

Leave a Reply