BIG BOSS 9| ఫైర్ బ్రాండ్ దివ్య ఔట్!
- ఇమ్మాన్యూల్ పవర్ అస్త్ర వినియోగంతో ఎలిమినేషన్ రద్దు
BIG BOSS 9 | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : బిగ్‌బాస్ సీజన్ 9లో ఫైర్ బ్రాండ్‌గా పేరు పొందిన దివ్య ఈ వారం ఎలిమినేట్ అయ్యారు. అయితే ఇమ్మాన్యులు పవర్ అస్త్ర వినియోగించడం తో ఎలిమినేషన్ రద్దు చేశాడు బిగ్ బాస్. ఈ వారం ఎలిమినేషన్ రద్దు కావడంతో బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న కళ్యాణ్, తనూజ, సుమన్ శెట్టి, ఇమ్మాన్యూల్, రీతూ, భరణి, పవన్, సంజన్, దివ్య కంటిన్యూ అవుతున్నారు.
BIG BOSS 9 |బిగ్‌బాస్‌లో బాండింగ్ బాగా పనిచేస్తోంది!
బిగ్‌బాస్ సీజన్ -9 బాండింగ్ బాగా పనిచేస్తోంది. ఈ వారం ఎలిమినేషన్ రద్దు కావడానికి కూడా బాండింగ్. ఈ వారం సంజన, దివ్య ఎలిమినేషన్ కి మిగిలారు. అయితే వీరిద్దరితో ఉన్న బాండింగ్ వల్ల ఎలిమినేషన్ రద్దు కు పవర్ అస్త్ర ఉపయోగించినట్లు పలువురు భావిస్తున్నారు.
భరణికి నాన్న అని పిలిచే తనూజ బాండింగ్ అనే ముద్ర పడింది. వైల్డ్ కార్డుగా దివ్య కూడా తనూజ బాండింగ్‌తోనే నెగ్గుకు వస్తుందని ముద్ర వేసింది. అయితే అదే బాండింగ్‌లోకి దివ్య కూడా వెళ్లింది. దీనికి తోడు భరణితో తనూజ క్లోజ్‌గా ఉండడం కూడా దివ్య సహించలేకపోయింది.

ఈ క్రమంలో తనూజ, దివ్య మధ్య కూడా ఎన్నో సార్లు వాగ్వాదం చోటు చేసుకున్నాయి. 11వ వారంలో కెప్టన్సీ టాస్క్ నుంచి ఎలిమినేట్ చేయడానికి దివ్య ప్రారంభంలో తనూజ పేరు చెప్పింది. దీనిపై వారిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో భరణి, ఇమ్మాన్యుల్, సంజన కూడా తనూజ పేరు చెప్పారు. అయితే ఈ టాస్క్ తనూజకు బిగ్ బాస్ మంచి అవకాశం ఇచ్చాడు. దీన్ని తెలివిగా ఉపయోగించిన తనూజ తన మిత్రురాలు రీతూ చౌదరిక మేలు జరిగే విధంగా నిర్ణయం తీసుకుంది. తనూజ వేసిన ఎత్తుకు పై ఎత్తుతో కెప్టన్సీ షిప్పు ఆశించిన భరణి, ఇమ్మాన్యూల్, దివ్యలకు చిత్తు చేస్తూ రీతూ అవకాశం వచ్చే లా నిర్ణయం తీసుకుంది.
గ్రూపు టాస్క్‌లో రెండు గ్రూపులు విభజించవల్సి వచ్చినప్పుడు దివ్య, భరణి, ఇమ్మాన్యూల్, సంజనకు ఒక టీమ్‌గా, రీతూ చౌదరి, పవన్, సుమన్ శెట్టి, కళ్యాణ్‌ను ఒక టీమ్‌గా తనూజ నిర్ణయించింది. దీంతో కెప్టన్సీ టాస్క్‌లో విజేతగా నిలిచిన రీతూ చౌదరి కెప్టన్ అయింది. ఎన్నో వారాలు నుంచి చివరి నిమిషం వరకూ వచ్చి పోతున్న రీతూ చౌదరికి కెప్టెన్‌గా అయ్యే అవకాశం దక్కింది. రీతూ చౌదరికి పవన్, కళ్యాణ్, తనూజతో ఉన్న బాండింగ్ వల్ల ఈ సారి కెప్టెన్‌గా అయ్యిందని చెప్పొచ్చు!
Click Here To Read This బిగ్‌బాస్ హౌస్‌లో క్లియర్ కట్

