TG | ఎమ్మెల్యే రాజాసింగ్‌కు భారీ ఊరట..

  • విద్వేశపూరిత ప్రసంగం కేసు కొట్టివేత

గోషామహాల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు ప్రజాప్రతినిధుల కోర్టులో భారీ ఊరట లభించింది. రాజాసింగ్‌పై నమోదైన విద్వేషపూరిత ప్రసంగం కేసులను శుక్రవారం ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టివేసింది. హైదరాబాద్‌ నగర వ్యాప్తంగా దాదాపు ఐదు పోలీస్‌ స్టేషన్లలో రాజాసింగ్‌పై విద్వేషపూరిత ప్రసంగం కేసులు నమోదైయ్యాయి.

ఈ కేసులపై విచారణ చేపట్టిన ప్రజాప్రతినిధుల కోర్టు మరోసారి రిపీట్‌ కావొద్దని హెచ్చరిస్తూ కొట్టివేసింది. ఇదిలావుండగా మహాశివరాత్రి పండుగ ముందు రోజు సైతం వేళ కూడా రాజాసింగ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహాశివరాత్రి సందర్భంగా హిందువులు పూజాసామాగ్రిని హిందువుల వద్దనే కొనుగోలు చేయాలని పిలుపునిచ్చారు.

రోజుల తరబడి స్నానం చేయకుండా.. గొడ్డు మాంసం తిని పూజా సామాగ్రి అమ్మే వారి నుంచి ఎలాంటి వస్తువులు కొనుగోలు చేయవద్దంటూ సంచలన కామెంట్స్‌ చేసిన విషయం విదితమే.

Leave a Reply