సురక్షా సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 30 మందికి సైకిళ్లు

సురక్షా సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 30 మందికి సైకిళ్లు

  • పి–4 కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా స్పందన
  • మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు

విజయవాడ, ఆంధ్రప్రభ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన పి–4 కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన లభిస్తున్నదని మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు పేర్కొన్నారు. సమాజ సేవా కార్యక్రమాల్లో స్వచ్ఛంద సంస్థలు, దాతలు ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. నగరంలోని గాయత్రినగర్‌లో ఉన్న సురక్షా సేవా చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో 30 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అశోక్ బాబు విద్యార్థినులకు సైకిళ్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించి వారిని ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ ఏడాది ఇప్పటివరకు ట్రస్ట్ ద్వారా 170 మందికి సైకిళ్లు పంపిణీ చేయగా, మరో 30 సైకిళ్లు అందజేయడం ప్రశంసనీయమని కొనియాడారు. సురక్షా సేవా చారిటబుల్ ట్రస్ట్ కన్వీనర్ కె.వి. నరసయ్య మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సహాయం చేయడం తనకు ఆనందంగా ఉందన్నారు. నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు పిలుపు మేరకు ట్రస్ట్ తరఫున డ్రోన్లు అందజేసినట్లు తెలిపారు.

నగర పరిసర కొండల్లో వృక్షావరణం పెంపొందించేందుకు హెలికాప్టర్ ద్వారా విత్తనాలు చల్లించినట్లు వివరించారు. ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రామారావు మాట్లాడుతూ పోలీసు శాఖకు ట్రస్ట్ అనుబంధం ఎంతో ఉందని, డ్రోన్ల సహాయంతో మారుమూల ప్రాంతాల్లో జరిగే అసాంఘిక కార్యకలాపాలను గుర్తించడంలో సాయం అవుతోందన్నారు. ఈ కార్యక్రమంలో చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు గడ్డం రవి, జనసేన నాయకుడు మురళీకృష్ణ, మాజీ కార్పొరేటర్ చెన్నుపాటి గాంధీ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply