Bhimgal | సర్పంచ్ కు సన్మానం

Bhimgal | సర్పంచ్ కు సన్మానం

Bhimgal | భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : భీమ్‌గల్ మండలం బడా భీమ్‌గల్ గ్రామం సర్పంచ్ రాచకొండ విష్ణువర్ధన్, ఉప సర్పంచ్ శంకర్ గౌడ్ గెలుపొందిన సందర్భంగా ఇవాళ‌ గ్రామ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయ బృందం సర్పంచ్ ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి స్వీట్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ… పాఠశాలలో ఉన్న మౌలిక వసతులపై త‌న‌ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని ఉపాధ్యాయులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నీలారాని, ఉపాధ్యాయులు కాశీరం, శంకర్, ప్రభాకర్, బాలకిషన్, పంచాయత్ కార్యదర్శి రజిత, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply