Bhimavaram | కలెక్టరమ్మ ముచ్చట్లు

Bhimavaram | కలెక్టరమ్మ ముచ్చట్లు

  • పాలకోడేరులో రైతన్న కోసం..
  • అన్నదాతలతో అరుగుపై కబుర్లు

Bhimavaram | భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ : రైతును ఆర్థికంగా బలోపేతం చేసే చర్యల్లో భాగంగా రైతన్న మీ కోసం కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఈ రోజు పాలకోడేరు మండలం కుముదవల్లి గ్రామంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సమక్షంలో రైతన్న మీకోసం కార్యక్రమాన్నివ్యవసాయ శాఖ నిర్వహించింది. కుముదవల్లి(Kumudavalli)లోని రైతు భూపతి రాజు సత్యనారాయణ పెంకుటిల్లు అరుగుపై ఏర్పాటు చేసిన రైతన్న మీకోసం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.

రైతులతో కలిసి అరుగుపై కూర్చుని ముఖాముఖిగా మాట్లాడారు. జిల్లా కలెక్టర్(District Collector) నేరుగా మాట్లాడడంతో రైతులు తమ సాధక బాధకాలను, వరి పంట సాగులో అనుభవాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి రైతులతో మాట్లాడుతూ, రైతుల ఆర్థిక ప్రయోజనాలను మరింత బలోపేతం చేసేందుకు రైతన్న మీకోసం కార్యక్రమాన్ని, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందన్నారు.

ప్రతీ రైతు ఇంటికి వ్యవసాయ శాఖ అధికారులు, అభ్యుదయ రైతులు వచ్చి వ్యవసాయ సాగులో అనువైన పద్ధతులు సేంద్రియ వ్యవసాయం, అగ్రిటెక్ తదితర వివరాలను తెలియజేస్తారని, రైతులు అవగాహన చేసుకోవాలని సూచించారు వ్యవసాయ శాఖ అధికారులు మీ ఇంటికి వచ్చి యాప్ ను ప్రతి ఒక్క రైతు మొబైల్ ఫోన్లో డౌన్ లోడ్(Download) చేసి ఇవ్వడంతో పాటు, యాప్ ద్వారా సమాచారాన్ని సులభంగా ఎలా తెలుసుకోవచ్చో చూపిస్తారని శ్రద్ధగా నేర్చుకోవాలి అన్నారు.

యాప్ ద్వారా పంట వేసిన దగ్గర నుండి కోతకు వచ్చే సమయం వరకు సమాచారాన్ని అందించడంతోపాటు, పంటకు ఏదైనా వస్తే ఏ విధమైన మందులను వినియోగించాలి ఎంత మోతాదులో వినియోగించాలి అన్న సమాచారాన్ని కూడా తెలుసుకోవచ్చు అన్నారు. రాబోయే మూడు, నాలుగు రోజుల ముందు వాతావరణాన్ని ఈ రోజే తెలుస్తుందన్నారు.

తద్వారా మీరు మీ పంటని ఎలా కాపాడుకోవాలో ముందస్తుగా చర్యలు తీసుకోవచ్చు అన్నారు. మీ గ్రామ వ్యవసాయ సహాయకుడు సహాయకుడి ఫోన్ నెంబర్(Phone no) నుండి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఫోన్ నెంబర్ వరకు ఈ యాప్ లో అందుబాటులో ఉంటాయని, మీకు ఏ విధమైన సహాయము, సూచనల అవసరమైన వారితో నేరుగా మాట్లాడే సమస్యను పరిష్కరించుకోవచ్చని తెలిపారు. యాప్ ను వినియోగించడం చాలా సులువైనదని, ప్రతి ఒక్కరూ యాప్ ను ఓపెన్(open the app) చేసి దానిలో ఏమేమి సమాచారాలు ఉన్నాయో రోజు చూసుకుంటూ ఉండాలని తెలిపారు.

వ్యవసాయ యాంత్రీకరణ ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందవచ్చని, జిల్లాలో ఇప్పటికే డ్రోన్లను అందుబాటులో తీసుకు రావడం జరిగింది అన్నారు. వ్యవసాయ కూలీలు దొరకటం కష్టంగా ఉండటంతో పాటు, ఖర్చు కూడా ఎక్కువ అవుతుందని, డ్రోన్ల వినియోగంతో ఖర్చు తగ్గుతుంది, సమయం ఆదావుతుందని, పంటపై పిచికారి చేసే మందుల ప్రయోజనం నూరు శాతం లభిస్తుంది అన్నారు. జిల్లాలో వ్యవసాయంతో పాటు, ఆక్వా ప్రయోజనాలను కూడా పొందుతున్నామని, దీని ద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని కూడా పొందగలుగుతున్నామని తెలిపారు.

జిల్లా కలెక్టర్ రైతులు ఇంటింటికి స్వయంగా వెళ్లి “రైతన్న మీకోసం, రైతు సేవలో మన మంచి ప్రభుత్వం” కరపత్రాలను రైతులుకు అందించడంతోపాటు, రైతులకు వనగూరే ప్రయోజనాలను కూడా వివరించడం జరిగింది. తొలుత జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్ వెంకటేశ్వరరావు రైతన్న మీకోసం కార్యక్రమం ద్వారా వనగూరే ప్రయోజనాలను రైతులకు వివరించారు.

ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్ వెంకటేశ్వరరావు, ఆర్డీవో కే.ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఏడిఏ కె ఎస్ ఎస్ శ్రీనివాసరావు, ఏవో సంధ్య, విఏఏ పావని, ఇన్చార్జి తహసీల్దార్ ఎం.రఘు, ఎంపీడీవో రెడ్డయ్య, పాలకోడేరు సొసైటీ చైర్మన్ కొత్తపల్లి నాగరాజు, కార్యదర్శి పివిఎల్ నరసింహారాజు, గ్రామ సర్పంచ్ భూపతి రాజు వంశీకృష్ణంరాజు పాల్గొన్నారు.

Leave a Reply