Bheengal Town | రిలే నిరాహార దీక్ష

Bheengal Town | భీంగల్ టౌన్, ఆంధ్రప్రభ : పట్టణంలోని 10వ వార్డులో అక్రమంగా రోడ్డును ఆక్రమించి గోడ కట్టిన వివాదంపై మున్సిపల్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షకు కూర్చున్నారు. పుష్ప కు సంబంధించిన ప్లాట్ లోకి వెళ్లేదారిని మూసివేసి కాలనీకి చెందిన ఇజ్రాయెల్ అనే వ్యక్తి గోడను నిర్మించడం జరిగిందన్నారు. గోడను తొలగించి న్యాయం చేయాలని రెండేండ్లుగా అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ రిలే నిరాహార దీక్షకు బాధిత కుటుంబ సభ్యులు కూర్చున్నారు. సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.
