బాధిత కుటుంబానికి రెండు లక్షల ఎల్ఓసి అందజేత..

బాధిత కుటుంబానికి రెండు లక్షల ఎల్ఓసి అందజేత..

భీమ్‌గల్‌ రూరల్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లోని భీమ్‌గల్‌ మండలం రహత్ నగర్ గ్రామానికి చెందిన భూక్య బాలు రూప్ల కొంతకాలంగా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్ లో చేరారు. ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించగా వైద్య సహాయం కొరకు గ్రామ నాయకుల సహాయ సహకారంతో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సంప్రదించగా ఆయన ముఖ్యమంత్రి సహాయనిధి నుండి 2 లక్షల రూపాయల ఎల్ఓసి ని అందజేయడం జరిగింది.ఆపద సమయంలో ఆదుకున్న బాల్కొండ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ కు బాధిత కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply