
Bheemgal | కౌంటింగ్ ఏర్పాట్లు…
Bheemgal | కౌంటింగ్ ఏర్పాట్లు…
Bheemgal | భీంగల్ టౌన్/ రూరల్, ఆంధ్రప్రభ : భీంగల్ మండలంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను బుధవారం జిల్లా ఎన్నికల పరిశీలకులు శ్యామ్ ప్రసాద్ పరిశీలించారు. బడా భీంగల్ లోని పోలింగ్ కేంద్రాన్ని ఆయన సందర్శించి ఎన్నికలు జరుగుతున్న తీరును పరిశీలించారు. ఓటింగ్ అనంతరం కౌంటింగ్ ఏర్పాట్లు గురించి ఎంపీడీఓ సంతోష్ కుమార్ ను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చూడాలని సూచించారు. ఆయన వెంట తహసీల్దార్ మొహమ్మద్ షబ్బీర్, మున్సిపల్ కమీషనర్ గోపు గంగాధర్ ఇతర ఎన్నికల సిబ్బంది ఉన్నారు.
