కాంగ్రెస్ నాయకుడి మట్టి దందా…

కాంగ్రెస్ నాయకుడి మట్టి దందా…
- ఆపే దమ్ముందా…?
- ధికారులకు చూసుకుంటున్న…?. నన్ను ఎవరు ఆపలేరు….!
భీమారం, ఆంధ్ర ప్రభ : ప్రజా పాలనలో కాంగ్రెస్ నేతల మట్టి దందా కాసుల పంటను కురిపిస్తుంది. రాత్రి పగలు తేడా లేకుండా మట్టి దందా చేస్తూ ఆ నాయకుడు లక్షలకు పడిగెత్తాడు. అడ్డుకోవాల్సిన రెవెన్యూ, పోలీసు, మైనింగ్ శాఖల అధికారులు అన్ని రకాలుగా ఆ నాయకుడికి సహకరిస్తున్నట్లు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి.
రాత్రి పూట డంప్…. తెల్లారి ట్రాక్టర్లతో డిస్పాచ్..
గ్రేటర్ పరిధిలో 66 డివిజన్ కు చెందిన కాంగ్రెస్ నాయకుడు మట్టి దందా చేస్తు అధికారులు ఆపగలరా అంటూ సవాల్ విసురుతున్నాడు. రాత్రిపూట ఎర్రగట్టుగుట్ట ప్రాంతానికి కూతవేటు దూరంలో ఉన్న చెరువు చుట్టుపక్కన గల ప్రభుత్వ భూమిలో చిన్న గుండు చుట్టుపక్కన రాత్రికి రాత్రే మట్టి తవ్వి, ఓ చోట డంప్ చేసుకొని తెలవారి ట్రాక్టర్లతో అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నాడ. ఈ విషయం అధికారులకు తెలిసిన పట్టించుకోకపోవడంపై పలు విమర్శలు స్థానికులు గుప్పిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మట్టి దందా కు కళ్లెం వేస్తారా..? లేదా ఆ కాంగ్రెస్ నాయకుడి దందాకు సపోర్ట్ చేస్తారా అన్నది వేచి చూడాలి.
