Bhawanipuram | అభివృద్ధి ప‌నుల‌కు శ్రీకారం..

Bhawanipuram | భవానిపురం, ఆంధ్రప్రభ : విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలోని సర్కిల్ 1 ప‌రిధిలో దాదాపు 2 కోట్ల రూపాయ‌ల అభివృద్ధి ప‌నుల‌కు ఎమ్మెల్యే సుజ‌నా చౌద‌రి అంకురార్ప‌ణ చేశారు. భ‌వానీపురం 41వ డివిజన్‌లో సభాపతి రోడ్డు నుంచి కరూర్ వైశ్యాబ్యాంక్ వెనుక రోడ్డు వరకు 37.96 ల‌క్ష‌ల అంచనా వ్యయంతో 245 మీటర్ల పొడవు, 5.5 మీటర్ల వెడల్పు తో సీసీ రోడ్డు పనులకు శిలా ఫ‌ల‌కం వ‌ద్ద పూజ‌లు చేసి శంఖుస్థాప‌న చేశారు.

అనంతరం 42 వ డివిజన్ టెలీఫోన్ కాలనీ పార్క్ రోడ్డులో 26.35 లక్షల అంచనాతో 185 మీటర్ల పొడవు, 5 మీటర్ల వెడల్సుతో సీసీ రోడ్డు మరియు డ్రైన్ నిర్మాణం పనులకు శంఖుస్థాపన చేశారు. భవానీపురం ప్రాంతంలోని 43 వడివిజన్ లో బైపాస్ రోడ్డు లో జోజినగర్ 48.38 లక్షల రూపాయలు,, ఊర్మిళానగర్ జంక్షన్ ల వద్ద 48.34 లక్షల వ్యయంతో డ్రైన్ ల మీద సింగిల్ బాక్స్ కల్వర్టుల నిర్మాణం ప‌నుల‌ను ప్రారంభించారు. భవానీపురం43 వ డివిజన్ లో దశరధరామిరెడ్డి వీధిలో 31.61 లక్షల అంచనాతో సీసీ రోడ్డు నిర్మాణం కు సంబందించిన పనులను లాంఛ‌నంగా ప్రారంభించారు.

240 మీటర్ల పొడవు, 5.30 మీటర్ల వెడల్పు గల రోడ్డు నిర్మాణం కు భూమి పూజ చేశారు. ఈ సంద‌ర్భంగా సుజ‌నా చౌద‌రి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఈ ప‌నులు పూర్త‌యితే ఈ ప్రాంతంలో 8 డివిజన్ల ప్రజలకు డ్రైనేజీ, రోడ్ల సమస్య తీరుతుందన్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో అన్నీ ప‌నులు త్వ‌రిత గ‌తిన పూర్తి చేస్తామ‌న్నారు. మ‌రి కొన్ని ప‌నులు కూడా ప్ర‌ణాళిక‌ల ద‌శ‌లో ఉన్నాయని తెలిపారు.

నియోజ‌క‌వ‌ర్గాన్ని పూర్తి స్థాయిలో డ‌వ‌ల‌ప్ చేసి చూపిస్తామ‌న్నారు. వెస్ట్ ను బెస్ట్ చేసే దిశ‌గా ప‌నులు సాగుతు్నాయ‌ని తెలిపారు. కార్య‌క్ర‌మంలో దూదేకుల కార్పొరేష‌న్ చైర్మ‌న్ నాగుల్ మీరా, స్థానిక‌ కూట‌మి నాయ‌కులు ఏదుపాటి రామ‌య్య‌, అబ్దుల్ ఖాద‌ర్, తిరుప‌తి అనూష‌, మున్సిప‌ల్ కార్పొరేష‌న్ అధికారులు, స్థానిక కార్పొరేట‌ర్లు పాల్గొన్నారు.

Leave a Reply