భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: తెలంగాణాలోని మావోయిస్ట్ లకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా హేమచంద్ర పురం పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో 86 మంది మావోయిస్టులు లొంగిపోయారు.. వీరిలో 66 మంది పురుషులు 20 మంది మహిళలు ఉన్నారు.. మల్టీ జోన్ 1 ఐజిపి చంద్రశేఖర్ రెడ్డి నేడు జరిగిన విలేకరుల సమావేశంలోఈ వివరాలు వెల్లడించారు.. ఈ ఏడాది మొత్తం 224 మంది మావోయిస్టులు లొంగిపోయారనీ పేర్కొన్నారు. ఇంకా 290 మంది మాత్రమే తెలంగాణలో యాక్టివ్ గా ఉన్నారని వారు కూడా జన జీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు వారికీ ప్రభుత్వం తరుపున పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు… ఈ రోజు లొంగిపోయిన వారిలో ఏరియా కమాండర్ లు నలుగురికి 4 లక్షలు, పార్టీ మెంబెర్స్ కు లక్ష రూపాయలు, మిగిలిన వారికి 25 వేలు చొప్పున నగదు ప్రోత్సాహకాలు అందజేశారు..
