Bhadrachalam | భ‌క్త‌జ‌నంతో పుల‌కించిన భ‌ద్రాద్రి

Bhadrachalam | భ‌క్త‌జ‌నంతో పుల‌కించిన భ‌ద్రాద్రి

  • వైభ‌వంగా వైకుంఠ ద్వార దర్శనం
  • భద్రాచలానికి పోటెత్తిన భక్తులు
  • ప్రశాంతంగా, భక్తి ప్రవక్తులతో ముగిసిన వేడుక

Bhadrachalam | భద్రాచలం, ఆంధ్ర‌ప్ర‌భ : భద్రాచలం(Bhadrachalam) శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం భ‌క్త జ‌నంతో పుల‌కించింది. వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని ఉత్తర ద్వార దర్శన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ రోజు ఉదయం ఐదు గంటల ప్రాంతంలో భక్తుల మంగళ వాయిద్యాలు, జయజయధ్వానాలు, వేదమంత్రాల నడుమ గరుడవాహనం పై భద్రాద్రి రామయ్య గజవాహనంపై సీతమ్మవారు, హనుమత్ వాహనంపై లక్ష్మణ స్వామి తెల్లని మేఘాలవలే అలుముకున్న ధూప మంజరలు, హేమంత ఋతువు వల్ల ఏర్పడిన పొగమంచు తొలిగిపోతూ మధ్య నుంచి భక్తులకు దర్శనమిచ్చారు.

Bhadrachalam |
Bhadrachalam |

స్వామి వారి దర్శనంతో పులకించిన భక్తులు వైకుంఠ దర్శనం(Vaikuntha Darshan) లభించగా భ‌క్తులు పులకించిపోయారు. రామాలయ అర్చక స్వాములు ఆధ్యాత్మిక వాతావరణంలో వైకుంఠ ఏకాదశి విశిష్టత గురించి భక్తి వాక్కులతో భక్తులకు వివరించారు. అనంతరం ఆస్థాన హరిదాసులు కోదండపాణి అడుగో అంటూ గానం చేస్తుండగా సపరివారంగా భద్రాద్రి రాముడు తిరువీధి సేవకు వేంచేశారు. భద్రాద్రి పురవీధులు ముక్కోటి పర్వదినాన భక్తుల రామనామ జపంతో ఆధ్యాత్మికత సంతరించుకుంది.

Bhadrachalam |
Bhadrachalam |
Bhadrachalam |
Bhadrachalam |
Bhadrachalam |

Bhadrachalam |
Bhadrachalam |

Bhadrachalam |

CLICK HERE TO READ MORE : స్వర్ణగిరిలో ముక్కోటి ఏకాదశి వేడుకలు

CLICK HERE TO READ MORE :

Leave a Reply