Bellampalli | కుర్రెగాడ్ జాతర పోస్టర్ ఆవిష్కరణ

Bellampalli | కుర్రెగాడ్ జాతర పోస్టర్ ఆవిష్కరణ
- ఈనెల 18 నుంచి 20 వరకు ఉత్సవాలు
Bellampalli | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : కాసీపేట మండలంలోని కుర్రెగాడ్ గ్రామంలో కొలువై ఉన్న శ్రీ పాహుండీ కుపర్ లింగు స్వామి జాతర ఉత్సవాల వాల్ పోస్టర్లను గురువారం బెల్లంపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రత్నం లక్ష్మి, కాసిపేట మండల ప్రెసిడెంట్ రత్నం ప్రదీప్ కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాతర కమిటీ నిర్వాహకులు మాట్లాడుతూ.. ఈ నెల 18వ తేదీ నుండి 20వ తేదీ వరకు మూడు రోజుల పాటు జాతర మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. రాజకీయ ప్రముఖులు, భక్తులు ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా హాజరై జాతరను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జాతర కమిటీ నిర్వాహకులు మడావి వెంకటేష్, శంకర్, నందం, వల్క రవి, జాతర కమిటీ సభ్యులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
