BCCI Awards | క్రికెట్ దిగ్గజానికి లైఫ్ టైమ్ అవార్డు..

  • ముంబైలో ఘ‌నంగా బీసీసీఐ వార్షికోత్స‌వం

బీసీసీఐ వార్షిక అవార్డుల ప్రదానోత్సవం ముంబైలో ఘ‌నంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన క్రికెటర్లకు అవార్డులు అందజేశారు. ఈ అవార్డుల్లో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు అరుదైన గౌరవం దక్కింది. BCCI సచిన్ టెండూల్కర్‌ను CK నాయుడు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో సత్కరించింది. ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్‌కు ఐసీసీ చైర్మన్ జై షా అవార్డును అందజేశారు.

2023-24 సంవ‌త్స‌రంలో అత్యుత్తమ అంతర్జాతీయ పురుష క్రికెటర్‌గా టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను బీసీసీఐ ఎంపిక చేసింది. అలాగే ఉత్తమ అంతర్జాతీయ మహిళా క్రికెటర్‌గా స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన ఎంపికైంది.

బీసీసీఐ అవార్డులు అందుకున్న స్టార్ ప్లేయ‌ర్లు

సీకే నాయుడు లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు : సచిన్‌
పాలి ఉమ్రిగర్‌ అవార్డు – ఉత్తమ అంతర్జాతీయ పురుష క్రికెటర్‌ : బుమ్రా
ఉత్తమ అంతర్జాతీయ అరంగేట్రం (పురుషులు) : సర్ఫరాజ్‌ ఖాన్‌
బీసీసీఐ స్పెషల్‌ అవార్డు: రవిచంద్రన్‌ అశ్విన్‌
దేశీయ క్రికెట్‌లో ఉత్తమ అంపైర్‌: అక్షయ్‌ తోట్రే

ఉత్తమ అంతర్జాతీయ మహిళా క్రికెటర్ : స్మృతి మంధాన
ఉత్తమ అంతర్జాతీయ అరంగేట్రం (మహిళలు) : ఆశా శోభనా
వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన మహిళా క్రికెటర్‌: స్మృతి మంధాన
వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన మహిళా క్రికెటర్‌ : దీప్తి శర్మ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *