BC Reservation | బీసీలు రాజ్యాధికార దిశగా ఉద్యమించాలి

BC Reservation | బీసీలు రాజ్యాధికార దిశగా ఉద్యమించాలి

BC Reservation | మోత్కూరు, ఆంధ్రప్రభ : రానున్న రోజుల్లో ఏ ఎన్నికలు జరిగినా బీసీలు ఐక్యంగా ఉండి రాజ్యాధికార దిశగా ఉద్యమించాలని బీసీ రిజర్వేషన్(BC Reservation) సాధన సమితి ( బి.ఆర్.ఎస్.ఎస్) రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు బుర్ర శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. ఈ రోజు స్థానిక మహాత్మ జ్యోతిరావు పూలే చౌరస్తా వద్ద బీసీ రిజర్వేషన్ సాధన సమితి సబ్ కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన 2026 నూతన సంవత్సర క్యాలెండర్ లను ఆ సంఘం నాయకులతో కలిసి విడుదల చేశారు.

ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ… దేశ జనాభాలో 70 శాతం(70 percent) పైగా ఉన్న బీసీలు స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు దాటినీ బీసీలు ఇంకా పేదరికం, ఆకలి, నిరుద్యోగం, నయవంచన, దోపిడీకి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలను దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు జెండాలు మోయించుకుంటూ జిందాబాద్ కొట్టించుకుంటున్నారే తప్ప రాజకీయంగా ఎదగనివ్వకుండా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.

బీసీలకు సభలో 50 శాతం రిజర్వేషన్ లేకపోవడం వల్ల విద్య, వైద్య ఉపాధి రంగాలలో త్రీవ అన్యాయానికి గురవుతున్నారని తెలిపారు. దేశవ్యాప్తంగా ఇంకా 27 కులాలు సంచారజాతులుగా జీవిస్తున్నారని శ్రీనివాస్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో 542 పార్లమెంట్ సభ్యులకు బీసీల జనాభా దామాషా ప్రకారంగా బీసీలు 272 స్థానాలు(272 seats) ఉండాల్సిందిగా కేవలం 108 మంది ఉన్నారని ఇంకా 18 రాష్ట్రాలలో ఒక్క బీసీ ఎంపీ లేడని తెలిపారు.

ఇప్పటికైనా బీసీలు ఏ పార్టీలో ఉన్న ఐక్యంగా ఉండి రాజ్యాధికార దిశగా ప్రయాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ రిజర్వేషన్ సాధన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు పురుగుల నర్సింహ్మ, రాష్ట్ర నాయకులు అవిశెట్టి అవిలిమల్లు, బయ్యని పిచ్చయ్య, జిల్లా నాయకులు కలిమెల నర్సయ్య, గుండగోని రామచంధ్రుగౌడ్ ,మండల అధ్యక్షులు శివార్ల శ్రీనివాస్ యాదవ్, మండల నాయకులు సూదగాని పాండు, మర్రి కమల్ నాథ్, కోమటి జనార్ధన్, కోల రాములు, లోడే రాజు నర్సింహ్మ, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply