Jyotirao Phule| నరసరావుపేట, ఆంధ్రప్రభ : జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో బీ.సీ భవన్ కోసం స్థలం కేటాయించి, భవనాన్ని నిర్మించాలని వైసీపీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా శుక్రవారం పలనాడు రోడ్డులోని పూలే విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వంలో కలెక్టరేట్ కు ఎదురుగా బీసీ భవన్ కోసం స్థలం కేటాయించారని తెలిపారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం ఆ స్థలాన్ని వేరే అవసరాలకు కేటాయించారని.. అందుకే ఎమ్మెల్యే బీసీ సామాజిక వర్గం నుంచి వచ్చిన వ్యక్తిగా తిరిగి బీసీ భవన్ కోసం స్థలం కేటాయించి భవన నిర్మాణం చేపట్టేందుకు చొరవ తీసుకోవాలని కోరారు.
పులి అనగారిన బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేశారని కొనియాడారు. విద్యుత్‌ని సామాజిక వికాసం కలుగుతుందని బలంగా నమ్మిన వ్యక్తిగా పూలే స్త్రీ విద్యను ప్రోత్సహించారన్నారు. అందుకోసం తన భార్య సావిత్రిబాయి పూలేని విద్యావంతురాలుగా తీర్చిదిద్ది మహిళలకు విద్యను అందించేందుకు ప్రత్యేకంగా ఒక పాఠశాల ఏర్పాటు చేసి తన భార్యను ఉపాధ్యాయురాలుగా నియమించిన గొప్ప సంఘసంస్కర్తగా పూలేను అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఈ ఎం స్వామి కందుల ఎజ్రా, సుజాత పాల్ తదితరులు పాల్గొన్నారు.

