Basara | బాసర క్షేత్రంలో భక్తజన సంద్రం

Basara | బాసర క్షేత్రంలో భక్తజన సంద్రం

Basara | బాసర, ఆంధ్రప్రభ : సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం చదువుల తల్లి కొలువైన బాసర క్షేత్రం(Basara Kshetra) ఈ రోజు భక్త జన సంద్రంగా మారింది. తెలుగు రాష్ట్రం నుండే కాక మహారాష్ట్ర నుండి వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు భక్తులతో సందడిగా మారాయి. ఉదయం నుండి భక్తులు గోదావరి నది(Godavari River)లో పుణ్య స్థానాలు ఆచరించి, నది తీరాన కొలువైన సూర్యేశ్వర ఆలయంలో మహా శివుని( Lord Shiva)కి అభిషేక అర్చన పూజలు నిర్వహించి కార్తీక దీపాలు వెలిగించారు.

అక్షరాభ్యాస పూజలు, అమ్మవారి దర్శనం కోసం భక్తులు క్యూ లైన్ లో భక్తులు బారులు తీరారు. అమ్మవారి దర్శనానికి భక్తులకు రెండు గంటలకు పైగా సమయం పట్టింది. ఆలయ సన్నిధిలోని ప్రత్యేక సాధారణ అక్షరాభ్యాస( Literacy) మండపాలలో భక్తులు తమ చిన్నారులకు ఆలయ అర్చకులచే వేదమంత్రోచ్చరణలతో అక్షరాభ్యాస పూజలు జరిపించి ఆలయంలోని అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

అనంతరం భక్తులు అమ్మవారి అన్నదాన సత్రంలో అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. సుమారు ఇరవై వేలకు పైగా భక్తులు(Devotees) అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. అక్షరాబ్యాస పూజలు, ప్రసాదాల అమ్మకాల ద్వార ఆలయానికి రూ.10 లక్షల ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు.

Leave a Reply