నీట మునుగుతున్న ఇద్దరిని కాపాడిన గంగ పుత్రుడు

నీట మునుగుతున్న ఇద్దరిని కాపాడిన గంగ పుత్రుడు

బాసర(నిర్మల్ జిల్లా) ఆంధ్ర‌ప్ర‌భ : బాసర గోదావరి నదిలో స్నానం ఆచరిస్తూ ప్రమాదవశాత్తు నీటమగుతున్న ఇద్దరిని గంగపుత్రుడు నరేష్ రక్షించాడు. వివరాల్లోకి వెళ్తే వరంగల్ జిల్లా కేంద్రానికి చెందిన ఇద్దరు యువకులు గోదావరి నదిలో పుణ్య స్నానాలు చేసేందుకు నదిలో ఈత కొడుతూ ముందుకు వెళ్లడంతో ప్రమాదవశాత్తు మనుగుతున్న వారిని నది తీరం వద్ద ఉన్న గంగ పుత్రుడు నరేష్ నదిలోకి దూకి ఇద్దరిని క్షేమంగా ఒడ్డుకు తీసుకవచ్చాడు.

యువకులను కాపాడిన నరేష్ను భక్తులు స్థానికులు అభినందించారు. ప్రమాదాల నివారణ మది తీరం వద్ద గజ ఈత గాళ్లను అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉంది.

Leave a Reply