Bar Association | సెంట్రల్ అడిషనల్ స్టాండింగ్ కౌన్సిల్‌గా…

Bar Association | సెంట్రల్ అడిషనల్ స్టాండింగ్ కౌన్సిల్‌గా…
- బెల్లంపల్లి బార్ అసోసియేషన్ సభ్యుల అభినందనలు
Bar Association | బెల్లంపల్లి టౌన్, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి బార్ అసోసియేషన్(Bar Association) సభ్యురాలిగా ఉన్న న్యాయవాది నల్లుల సంగీత సెంట్రల్ అడిషనల్ స్టాండింగ్ కౌన్సిల్‌గా నియమితులయ్యారు. సెంట్రల్ అడిషనల్ స్టాండింగ్ కౌన్సిల్‌గా నియమితులైన సందర్భంగా ఈ రోజు బెల్లంపల్లి బార్ అసోసియేషన్ సభ్యులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా న్యాయవాది సంగీత నల్లుల మాట్లాడుతూ… తనకు అప్పగించిన బాధ్యతలను నిబద్ధతతో, సక్రమంగా నిర్వహిస్తానని తెలిపారు. ఈ అవకాశం కల్పించిన కేంద్ర ప్రభుత్వా(Central Government)నికి ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
