- ఘన స్వాగతం పలికి కలెక్టరేట్‌లోకి ఆహ్వానించిన అధికారులు
- కలెక్టర్ వినోద్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన జేసీ
బాపట్ల కలెక్టరేట్ అక్టోబర్ 15 ఆంధ్రప్రభ : స్థానిక జాయింట్ కలెక్టర్‌గా భావన విశిష్ట బుధవారం బాధ్యతలు స్వీకరించారు. పూర్వపు జేసీ ప్రకాష్ జైఎన్ ఐడీఎంకు బదిలీ అవ్వగా ఆస్థానం ఆరు నెలల పాటు ఖాళీగా ఉంది. ఇంచార్జ్ జేసీగా డీఆర్ఓ గంగాధర్ గౌడ్ వ్యవహరిస్తున్నారు. దీంతో కాకినాడ పురపాలక కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న భావన ను బాపట్ల జిల్లా జేసీగా నియమించారు. భావన స్వస్థలం హరియాణా 1992 సెప్టెంబర్ 18న ఆమె జన్మించారు.(2010-2014) ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ లోని మోతిలాల్ నెహ్రూ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అలహాబాద్, యూనివర్సిటీ లో అండర్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ డిగ్రీ బీటెక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్మెంట్లో నాలుగు సంవత్సరాలు విద్యనభ్యసించారు.

2014-2016 నోయిడా లోని క్రోనోస్ ఇన్ కార్పొరేట్ సంస్థలో సాఫ్ట్వేర్ డెవలపర్ గా విధులు నిర్వహించారు. 2019 ఐఏఎస్ బ్యాచ్ మెయిన్స్ లో 847, ఇంటర్వ్యూలో 182 మొత్తం1029 మార్కులు లతోయూపీఎస్సీ ఆల్ ఇండియా ర్యాంక్ 68వ స్థానం సాధించారు. ఆమె ఐఏఎస్ శిక్షణ పొందుతూ కృష్ణాజిల్లా ట్రైనీ కలెక్టర్ గా నిధులు నిర్వహించారు, హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ సెక్రటరీ టు గవర్నమెంట్, అనంతరం పార్వతీపురం సబ్ కలెక్టర్ గా తొలి పోస్టింగ్ పొందారు. అనంతరం అల్లూరి సీతారామరాజు జిల్లా సంయుక్త కలెక్టర్ గా బాధ్యతలు నిర్వహించారు.

బదిలీపై కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా విధులు నిర్వహించారు. ఇటీవల జరిగిన బదిలీలలో బాపట్లకు జేసీగా నియమితులయ్యారు. బుధవారం బాపట్ల జిల్లా జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె కలెక్టర్ వినోద్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. ముందుగా ఆమెకు వీఆర్వో గంగాధర్ గౌడ్ ఆర్డీఓ గ్లోరియా తహసీల్దార్ సలీమా, కలెక్టరేట్ ఏఓ మల్లికార్జునరావు మర్యాదపూర్వకంగా పూల బొకేలతో కలెక్టరేట్లోకి స్వాగతం పలికారు. బాధ్యతలు స్వీకరిస్తున్న ఆమెకు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.