అత్తింటికి సమాచారం ఇచ్చి పరారైన భర్త ..
బెంగుళూరు లో సాప్ట్ వేర్ ఇంజనీర్ ఘాతుకం
బెంగళూరు – బెంగుళూరు నగరలోని హుళిమావులో ఓ సాఫ్ట్ వేర్ భర్త తన భార్యను అతి దారుణంగా హత్య చేశాడు.. ఆ తర్వాత ఆమె మృతదేహన్ని ఒక సూట్ కేసులో కుక్కి ప్యాక్ చేసి బాత్ రూంలో పడేసి పరారయ్యాడు.. ఈ ఘటన కర్నాటకలోని బెంగళూరులో చోటు చేసుకుంది..
వివరాలలోకి వెళితే.. మహారాష్ట్రకు చెందిన గౌరీ, రాకేశ్‌లు రెండేళ్ల క్రితం వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. నిందితుడు రాకేశ్ బెంగుళూరులోని ఓ ఐటీ కంపెనీలో ప్రాజెక్టు మేనేజరుగా పనిచేస్తుండగా, గౌరీ మాత్రం ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తుంది. వారి మధ్య ఏమైందో తెలీయదు కాని బార్య గౌరిని కిచెన్ నైఫ్ లో గొంతు కోసి హత్య చేశాడు.. ఆ తర్వాత హత్య చేసిన తర్వాత నిందితుడు మృతురాలి తల్లిదండ్రులకు చేసిన ఘాతుకాన్ని చెప్పి అక్కడ నుంచి పరారయ్యాడు… మహారాష్ట్ర పోలీసుల నుంచి సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు వెంటనే స్థానిక పోలీసుకు తెలియజేశారు.
అక్కడ ఇంటిలో తనిఖీ చేయగా సూట్‌కేసులో ఓ మహిళ మృతదేహం లభించింది. మృతురాలిని గౌరీ అనిల్ సంబేకర్ (32)గా గుర్తించారు. ఆమె భర్త రాకేశ్ సంబేకర్ ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై పోలీసులు మాట్లాడుతూ, సాయంత్రం ఐదు గంటల సమయంలో తమకు ఫోన్ వచ్చిందని, వెంటనే హుళిమావు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారని పోలీసులు తెలిపారు. వారు అక్కడకు వెళ్లేసరికి ఇంటికి తాళం వేసి ఉందని, తలుపులు బద్ధలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా బాత్రూంలో ఒక సూట్‌కేసు కనిపించిందని వెల్లడించారు. ఫోరెన్సిక్ బృందం సూట్‌కేసును తెరిచి చూడగా గౌరీ మృతదేహం లభ్యమైందని వివరించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత ఆమె మరణానికి గల కారణాలు తెలుస్తాయని వెల్లడించారు.
మరోవైపు, గౌరీ భర్త రాకేశ్‌ను పుణేలో పోలీసులు అప్పటికే అరెస్టు చేసినట్టు తెలిపారు. ప్రస్తుతం నిందితుడుని బెంగుళూరుకు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు హుళిమావు పోలీసులు తెలిపారు. ఈ హత్యకు గల కారణాలపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.