Bandi Vs Etela | బీజేపీలో జూబ్లీ ఉప ఎన్నిక చిచ్చు..

Bandi Vs Etela | బీజేపీలో జూబ్లీ ఉప ఎన్నిక చిచ్చు..

Bandi Vs Etela, హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ (Telangana) బీజేపీలో ముఖ్యనేతలు బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ మధ్య పేలుతున్న మాటల తూటాలు ఇటు కమలం పార్టీలో అటు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. మూడు రోజులుగా ఇరువురు నేతలు ఒకరి పై ఒకరు చేసుకుంటున్న పరోక్ష కామెంట్లు సోషల్ మీడియాలోనూ బండి సంజయ్ వెర్సెస్ ఈటల ఎపిసోడ్ హాట్ హాట్ గా ట్రెండ్ అవుతోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముగిసి ఫలితం వెలువడినా ఆ ఉప ఎన్నిక అంశం ఇప్పుడు బీజేపీలో ఆసక్తికర పరిణామాలకు దారి తీస్తుండడం గమన్హారం.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ముస్లింలు కలిసికట్టుగా కాంగ్రెస్ ను (Congress) గెలిపించారని ఇక పై హిందువులు అంతా ఏకమై కాంగ్రెస్ ను ఓడించాలని ఫలితం వెలువడ్డాక బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే.. ఆ వ్యాఖ్యల పై ఎంపీ ఈటల రాజేందర్ విమర్శలు చేశారు. ప్రధాని మోడీ కూడా మసీదుకు, చర్చికు వెళ్లారని గుర్తు చేశారు. తెలంగాణలో డివిజన్ పాలిటిక్స్ తో అధికారంలోకి రాలేమని హాట్ కామెంట్స్ చేశారు. కులం, మతం ప్రాతిపదికన రాజకీయాలు నిలబడవని పరోక్షంగా కేంద్రమంత్రి బండి సంజయ్ కు చురకలు అంటించారు.

మరి కొన్ని వార్తలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

https://epaper.prabhanews.com/

Leave a Reply