గంభీరావుపేట : ఇద్దరూ వేర్వేరు పార్టీల్లో కీలక నేతలు.. రాజకీయ శత్రువులు (Political enemies).. నిత్యం ఒకరిపై ఒకరు విమర్శలతో మీడియాలో కనిపిస్తుంటారు.. రాజకీయంగానే కాదు.. వ్యక్తిగతంగా కూడా విమర్శలకు దిగుతున్నారు… ఒకరు అయితే పరువునష్ట దావా (Defamation suit) కు కోర్టు గడప ఎక్కడానికి సిద్ధపడ్డారు.. ఆ ఇద్దరు ఎవరో కాదు ఒకరు బీజేపీలో కీలక నేత, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay), మరొకరు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి , సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారకరామారావు (కేటీఆర్) (KTR) ఒకరికొకరు ఎదురు పడిన వెంటనే ఆత్మీయంగా పలుకరించుకున్నారు.
గురువారం నర్మాల (Narmala) వద్ద వరదల్లో చిక్కుకున్న బాధితులను పరామర్శించేందుకు వచ్చిన వారు ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకొని ఆలింగనం చేసుకోవడం విశేషం. అటు బిజెపి శ్రేణులు ఇటు గులాబీ నాయకులు ఈ సంఘటనను చూస్తూ విస్తుపోయారు.