మునుగోడులో బంద్ ప్రశాంతం
మునుగోడు, ఆంధ్రప్రభ : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు బీసీ జేఏసీ(BC JAC) తలపెట్టిన బంద్ మునుగోడు మండల వ్యాప్తంగా ప్రశాంతంగా కొనసాగుతోంది. మండల కేంద్రంలో అన్ని వ్యాపార సముదాయాలు, విద్యాసంస్థలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి.
ఉదయం ఏడు గంటలకే బీసీ కుల సంఘాలు, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, టీడీపీ, డీఎస్‌పీ(BRS, Congress, BJP, CPI, TDP, DSP) నాయకులు రోడ్డుపై బైఠాయించి బంద్ పాటించారు. ప్రైవేట్ విద్యాసంస్థలు ముందుగానే సెలవులు ప్రకటించాయి. అనంతరం గ్రామంలో బీసీ నినాదాలతో ర్యాలీ చేపట్టారు. బంద్ లో భాగంగా ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు.

