వేములవాడలో బంద్ ప్రశాంతం
బీసీల ఆందోళనలో పాల్గొన్న ప్రభుత్వ విప్ శ్రీనివాస్
వేములవాడ, అక్టోబర్ 18 (ఆంధ్రప్రభ): బడుగుల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (Adi Srinivas) అన్నారు. బీసీ రిజర్వేషన్ల అమలు చేయాలని కోరుతూ బీసీ సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన రాష్ట్ర బంద్ కార్యక్రమం లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ బస్ డిపో ముందు శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో శనివారం కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రజా పాలనలో భాగంగా తెలంగాణ (Telangana) లోని బీసీలకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెల్లవారుజామున కాంగ్రెస్ శ్రేణులతో కలిసి డిపో ముందు బందుకు సంఘీభావం తెలిపారు. ప్రభుత్వ విప్ డిపోకు చేరుకోగానే ఒక బస్సు కూడా బయటకు రాలేదు.
బీసీలకు 42 శాతం కల్పించేంత వరకు ప్రభుత్వం (Government) కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో చిలుక రమేష్ ,బింగి మహేష్, రొండి రాజు, కూరగాయల కొమరయ్య, కోయినేని బాలయ్య, గూడూరు మధు, కనికరపు రాకేష్ ,ఖమ్మం గణేష్, నాగుల విష్ణు ,సుదర్శన్ యాదవ్, మైలారం రాము, సీపీఐ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


