Ballot boxes | బాలెట్ బాక్సులు పరిశీలన…

Ballot boxes | బాలెట్ బాక్సులు పరిశీలన…
Ballot boxes | బోధన్, ఆంధ్రప్రభ : గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా ఉపయోగించే బ్యా లెట్ బాక్సుల(Ballot boxes)ను జిల్లా ఎన్నికల అబ్జర్వర్ శ్యాం ప్రసాద్ లాల్(Shyam Prasad Lal) పరిశీలించారు. ఈ రోజు బోధన్ మండల పరిషత్ కార్యాలయంలో ఉంచిన బ్యాలెట్ బాక్సులను తహసిల్దార్ విట్టత్‌తో కలిసి పరిశీలించారు.
ఎన్నికల సందర్భంగా తగినన్ని బ్యాలెట్ బాక్సులను అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. మండలంలోని సంఘం గ్రామంలో నామినేషన్ ప్రక్రియ(nomination process)ను పరిశీలించారు. నామినేషన్ పత్రాలు నింపడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను అభ్యర్థులకు వివరించారు.
