Balayya | 12న అఖండ 2 రిలీజ్..
Balayya | Akanda 2, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుల క్రేజీ కాంబోలో రూపొందిన డివైన్ ఎంటర్టైనర్ అఖండ 2 : ది తాండవం. ఈ భారీ చిత్రం(Huge picture) అన్ని సమస్యలను పరిష్కరించుకుంది. ఈ చిత్రం ఇప్పుడు డిసెంబర్ 12న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. డిసెంబర్ 11 న గ్రాండ్ ప్రీమియర్స్. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ మూవీని నిర్మించారు. ఎం తేజస్విని నందమూరి సమర్పణలో వస్తున్న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా(All over the world) ప్రేక్షకులకు గొప్ప థియేటర్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది.
బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబో సింహా, లెజెండ్, అఖండ చిత్రాలతో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్లను అందించింది. ఈ కాంబోలో వస్తున్న నాల్గవ సినిమా కావడం, ముఖ్యంగా బాలకృష్ణ వరుసగా నాలుగు హిట్ల(Four hits)ను సాధించడంతో అఖండ2 పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రతి ప్రమోషనల్ కంటెంట్ మరింత బజ్ పెంచింది. సనాతన హైందవ ధర్మం బ్యాక్ డ్రాప్(Sanatana Hinduism Background) లో వస్తున్న ఈ చిత్రం మాస్, యాక్షన్, డివైన్ ఎలిమెంట్స్ తో గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించబోతుందని మేకర్స్ గట్టి నమ్మకంతో చెబుతున్నారు.
Balayya | మనసుని హత్తుకునే మదర్ సెంటిమెంట్‌తో..
హై-యాక్షన్ సన్నివేశాలతో పాటు, ఈ చిత్రంలో అద్భుతమైన ఎమోషన్స్ ఉండబోతున్నాయి. ముఖ్యంగా కథనాన్ని నడిపించే.. మనసుని హత్తుకునే మదర్ సెంటిమెంట్ ప్రేక్షకులకు మంచి ఎమోషన్(Good emotion) అందించబోతుంది. ప్రేక్షకులు బాలకృష్ణను మూడు విభిన్న గెటప్‌లలో చూడబోతున్నారు. ఇది మరింత ఉత్సాహాన్ని జోడిస్తోంది. ఎస్ థమన్ సంగీతం మరో మెయిన్ హైలైట్. ఇది సినిమా ఎనర్జీ, గ్రాండియర్ ని పెంచుతుంది. సంయుక్త కథానాయిక(Joint heroine)గా నటించగా, ఆది పినిశెట్టి, హర్షాలి మల్హోత్రా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మరి.. అన్ని అడ్డంకులును దాటుకుని వస్తున్న అఖండ 2.. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ లో సక్సెస్ సాధిస్తుందో.. ఎలాంటి రికార్డులు సెట్ చేస్తుందో చూడాలి.


