Balakrishna | కథ చెప్పలేదా? అసలు నిజం ఏంటి?

Balakrishna | కథ చెప్పలేదా? అసలు నిజం ఏంటి?
Balakrishna | బాలయ్య – పూరి కాంబో మళ్లీ సెట్స్‌పైకి రానుందా?
ఒకప్పుడు బాలయ్య వేరు… ఇప్పుడు కథే కీలకం
బాలయ్య దగ్గర డైరెక్టర్ల క్యూ
పూరి ‘స్లమ్ డాగ్’ ఫలితంపై భవిష్యత్ ఆధారమా?
గాసిప్పా..? నిజమా..? క్లారిటీ ఎప్పుడు?

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : నట సింహం నందమూరి బాలకృష్ణ, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. ఈ ఇద్దరి కాంబోలో పైసా వసూల్ సినిమా రూపొందడం.. ఆ సినిమా అభిమానులకు విపరీతంగా నచ్చడం తెలిసిందే. ఆ సినిమా కమర్షియల్ సక్సెస్ ఎలా ఉన్నా.. ఆ సినిమా కంటూ సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇదిలా ఉంటే.. బాలయ్య, పూరి కలిసి మరో సినిమా చేద్దామనుకున్నారు కానీ.. ఇంత వరకు సెట్ కాలేదు. ఇప్పుడు ఈ క్రేజీ కాంబో మళ్లీ సెట్ అయ్యిందని వార్తలు వస్తున్నాయి. మరి.. ఈ కాంబో నిజంగా సెట్ అయ్యిందా..? లేక గాసిప్పా..?

Balakrishna | ఒకప్పుడు బాలయ్య వేరు..

Balakrishna

బాలయ్య ఒకప్పుడు వేరు.. ఇప్పుడు వేరు. ఆయనకు ఎవరు నచ్చితే.. వాళ్లకే ఆఫర్ అన్నట్టు ఉండేది. ఇదంతా గతం. ఇప్పుడు అయితే.. కథ నచ్చాలి.. అందులో పాత్ర నచ్చాలి. దర్శకుడి పై పూర్తి నమ్మకం ఉండాలి. ఇలా వుంది ఇప్పటి బాలయ్య వ్యవహారం. క్రిష్ కు ముందుగా ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999 చేయడానికి ఓకే చెప్పి ఆతర్వాత నో చెప్పారంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం బాలయ్య.. మలినేని గోపీచంద్ తో సినిమా చేస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ భారీ చిత్రాన్ని అతి త్వరలో సెట్స్ పైకి తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Balakrishna | బాలయ్య దగ్గర పెద్ద క్యూ..

Balakrishna

ఇదిలా ఉంటే.. బాలయ్యతో పూరి సినిమా అనే వార్త అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్ అయ్యింది. బాలయ్య, మలినేని గోపీచంద్ తో సినిమా తర్వాత ఎవరితో అనేది ఇంకా ఫైనల్ చేయలేదు. అయితే.. ఆయన దగ్గర చాలా మంది డైరెక్టర్స్ వెయిటింగ్ లో ఉన్నారు. ఇంకా చెప్పాలంటే అక్కడ పెద్ద క్యూనే ఉంది. పూరి.. ప్రస్తుతం స్లమ్ డాగ్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ అనుకున్న ప్లాన్ ప్రకారం జరిగింది. అయితే.. ఓటీటీ డీల్స్ ఫైనల్ అయితే.. రిలీజ్ డేట్ అనౌన్స్ చేయచ్చని పూరి అండ్ టీమ్ ఎదురు చూస్తున్నారు.

Balakrishna | కథ చెప్పలేదా..

Balakrishna

మరి.. బాలయ్య, పూరి కాంబో మూవీ నిజమేనా అంటే.. ఇంత వరకు బాలయ్యకు పూరి కథ చెప్పలేదట. వీరిద్దరూ మరోసారి కలిసి వర్క్ చేయాలి అనుకుంటున్నారు కానీ.. అది సాధ్యమేనా అంటే.. స్లమ్ డాగ్ సక్సెస్ పై ఆధారపడి ఉంటుందని టాక్ వినిపిస్తోంది. పూరి వరుస ప్లాపుల్లో ఉండడం వలన ఆయనతో సినిమా చేసేందుకు హీరోలు అంతగా ఇంట్రెస్ట్ చూపించడం లేదట. అందుచేత బాలయ్య అయినా పూరికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలంటే.. స్లమ్ డాగ్ సక్సెస్ అవ్వాల్సిందే. అందుచేత స్లమ్ డాగ్ రిలీజ్ ఆతర్వాతే పూరి నెక్ట్స్ ఏంటి..? అనేది క్లారిటీ వస్తుంది. అప్పటి వరకు ప్రచారంలో ఉన్న వార్తలు గాసిప్ లే కానీ.. వాస్తవం కాదు అనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. సో.. పూరి, బాలయ్య కాంబో మూవీ పై క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Leave a Reply