Balakrishna | బ్లాక్ బస్టర్ సాధించేనా..?

Balakrishna | బ్లాక్ బస్టర్ సాధించేనా..?

Balakrishna | బాలయ్య-గోపీచంద్ మలినేని కాంబోపై భారీ అంచనాలు
ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆసక్తికర చర్చ
బాలయ్య-నయనతార జంట మళ్లీ సెట్ అవుతుందా?
అనుష్క పేరు ఎందుకు వినిపిస్తోంది?
అభిమానుల్లో పెరుగుతున్న ఉత్కంఠ
దసరాకి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారా?
బాలయ్య మూవీలో హీరోయిన్ పై త్వరలో క్లారిటీ?

Balakrishna | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : నందమూరి బాలకృష్ణ, మలినేని గోపీచంద్.. ఈ ఇద్దరి కాంబోలో భారీ క్రేజీ మూవీ రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఇటీవల సెట్స్ పైకి వచ్చిన ఈ సినిమా కోసం భారీ యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు. అయితే.. ఈ సినిమాలో నటించే హీరోయిన్స్ ఎవరు అనేది ఆసక్తిగా మారింది. ఇప్పుడు ఇద్దరు అందాల భామలు పేర్లు వినిపిస్తున్నాయి. ఇంతకీ.. ఆ ఇద్దరు భామలు ఎవరు..? ఈ భారీ చిత్రం థియేటర్స్ లోకి వచ్చేది ఎప్పుడు..?

Balakrishna | బాలయ్య, నయన్..

Balakrishna

ఈ సినిమాలో బాలయ్యకు జంటగా అందాల తార నయనతార నటించనున్నట్టుగా గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది. బాలయ్య, నయనతార కాంబినేషన్లో.. సింహా, శ్రీరామరాజ్యం, జై సింహా సినిమాలు వచ్చాయి. ఈ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ సాధించాయి. సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందనో.. లేక ఈ సినిమాలో పాత్రకు నయన్ అయితే పర్ ఫెక్ట్ అనేట్టుగా సెట్ అవుతుందనో ఆమెనే తీసుకోవాలి అనుకుంటున్నారని తెలిసింది. బాలయ్య, నయన్ జంట మరోసారి నటిస్తే బాగుంటుందని అభిమానులు కూడా కోరుకుంటున్నారు. దాదాపుగా నయన్ ఈ సినిమాలో నటించడం ఖాయమని టాక్ వినిపిస్తోంది.

Balakrishna | బాలయ్య, అనుష్క..?

Balakrishna

తాజాగా అనుష్క పేరు వినిపిస్తుంది. బాలయ్య, అనుష్క కలిసి ఒకే ఒక్క సినిమాలో నటించారు. అదే.. ఒక్క మగాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడింది. ఆతర్వాత వీరిద్దరూ కలసి మరో సినిమా చేయలేదు. అయితే.. ఈ సినిమాలో ఉన్న క్యారెక్టర్ కు అనుష్క సెట్ అవుతుందని.. ఆమెని కాంటాక్ట్ చేసారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

Balakrishna

అయితే.. ఇటీవల అనుష్క పెళ్ళి ఫిక్స్ అయ్యిందని.. ఆమె చేతిలో ఒక్క మలయాళం సినిమా మాత్రమే ఉందని.. త్వరలోనే ఆ సినిమాని పూర్తి చేసి మ్యారేజ్ చేసుకోబోతుందని వార్లు వచ్చాయి. ఇదే నిజమైతే.. బాలయ్య సినిమా కోసం ఆమెను కాంటాక్ట్ చేసినా నటించకపోవచ్చు అని కూడా ప్రచారం జరుగుతుంది. దీంతో.. బాలయ్య మూవీలో హీరోయిన్ ఎవరు అనేది సస్పెన్స్ గా మారింది. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ కానుంది అంటే.. దసరాకి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. మరి.. ఈ క్రేజీ మూవీలో హీరోయిన్ ఎవరనేది త్వరలో క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

Balakrishna

click here to read పబ్లిక్ టాక్ ఇదే..

click here to read more

Leave a Reply