Bheemgal | విద్యార్థులకు బాలరత్న అవార్డులు

Bheemgal | విద్యార్థులకు బాలరత్న అవార్డులు

Bheemgal | భీంగల్ టౌన్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా భీంగల్ (Bheemgal) మండలం బాచన్ పల్లి ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలకు చెందిన స్టూడెంట్స్ కు బాలరత్న అవార్డులు వచ్చాయి. కమలాకర మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ వారు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని వివిధ రంగాల్లో నైపుణ్యం కలిగిన బాలలకు బాలరత్న అవార్డ్స్ (Awards) అందజేస్తున్నారు.

అవార్డుల కార్యక్రమాన్ని గత కొన్ని సంవత్సరాలుగా జరుపుతున్నారు. ఇందులో భాగంగా భీమగల్ మండలం జెడ్పిహెచ్ఎస్ బాచన్ పల్లి పాఠశాల (Bachan Pally School) లో ఎనిమిదవ తరగతి చదువుతున్న రావుట్ల లిఖిత్ శృతిక రశ్మితలకు సాహిత్య రంగంలో వారి నైపుణ్యాలను గుర్తించి బాలరత్న అవార్డులు అందజేశారు.

హైదరాబాద్ లోని కోటి సుల్తాన్ బజార్ లో గల శ్రీకృష్ణదేవరాయ భాష నిలయంలో ఈ నెల 18న ముగ్గురు చిన్నారులకు బాలతరత్న అవార్డులు నిర్వాహకులు అందజేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, బాల గంగాధర్, ఉపాధ్యాయులు అవార్డు లు అందుకున్న విద్యార్థులకు అభినందనలు తెలిపారు.

Leave a Reply