Bail | అంబటి రాంబాబుకు బెయిల్

Bail | అంబటి రాంబాబుకు బెయిల్
- రేపు విడుదలయ్యే అవకాశం
Bail | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్ లభించింది. గుంటూరు కోర్టు అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరు చేసింది. గతేగడాది నవంబర్ 12న నమోదైన కేసులో బెయిల్ మంజూరు చేస్తూ గుంటూరు కోర్టు తీర్పును వెలువరించింది.
పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన కేసులో బెయిల్ వచ్చింది. అలాగే చంద్రబాబును దూషించిన కేసులో ఇప్పటికే బెయిల్ లభించింది. అయితే బెయిల్ రావడంతో రేపు విడుదలయ్యే అవకాశముంది.
