Badminton |వచ్చే నెల నుంచి ఆసియా ఛాంపియన్‌షిప్‌.. భారత్‌కు కఠిన సవాల్ !

బ్యాడ్మింటన్ ఆసియా ఛాంపియన్‌షిప్స్ 2025 వచ్చే నెల (ఏప్రిల్) 8 నుండి 13వ తేదీ వరకు జరగనుంది. అయితే, ఈ టోర్నమెంట్‌లో, భారత్ స్టార్ ఆటగాళ్లందరూ మొదటి రౌండ్‌లో ట‌ఫ్ ఫైట్ ఎదుర్కోవలసి ఉంటుంది. తొలి రౌండ్లలో భార‌త్ ప్లేయ‌ర్ల‌ను ఎదురుక్కొనేందుకు చాలా మంది కఠినమైన ప్రత్యర్థులు ఎదురు చూస్తున్నారు.

భార‌త్ స్టార్ ష‌ట్ల‌ర్, 2021 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతక విజేత ల‌క్ష్య సేన్.. ఈ నెల ప్రారంభంలో జరిగిన ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనలిస్ట్ అయిన చైనీస్ తైపీకి చెందిన లీ చియా-హావోతో తన ప్రారంభ‌ మ్యాచ్ ఆడ‌న్నాడు. మ‌రో స్టార్ ప్లేయ‌ర్ హెచ్ ఎస్ ప్ర‌ణ‌య్ తన తొలి మ్యాచ్‌లో చైనాకు చెందిన గువాంగ్ జు లుతో తలపడనున్నాడు.

మహిళల సింగిల్స్‌లో, పివి సింధు ఇండోనేషియాకు చెందిన ప్రపంచ 34వ ర్యాంకర్ ఎస్టర్ నురుమి ట్రై వార్డోయోతో తన ప్రచారాన్ని ప్రారంభించనుంది, ఆమె స్వదేశీయులు కఠినమైన సవాళ్లను ఎదుర్కొంటున్నారు.

బ్యాడ్మింటన్ ఆసియా ఛాంపియన్‌షిప్‌లో భార‌త్ తొలి రౌండ్ వివ‌రాలు

పురుషుల సింగిల్స్ :
లక్ష్య సేన్ vs లీ చియావో-హావో (చైనీస్ తైపీ)
హెచ్ఎస్ ప్రణయ్ vs గ్వాంగ్ జు లు (చైనా)
ప్రియాంషు రాజావత్ vs కాంటఫోన్ వాంగ్‌చారోయెన్ (థాయ్‌లాండ్)
కిరణ్ జార్జ్ vs క్వాలిఫైయర్

మహిళల సింగిల్స్ :
పివి సింధు vs ఎస్టర్ నురుమి ట్రై వార్డోయో (ఇండోనేషియా)
అనుపమ ఉపాధ్యాయ vs రచ్చనోక్ ఇంటనాన్ (థాయ్‌లాండ్)
మాళవిక బన్సోడ్ vs ఫాంగ్ జీ గావో (చైనా)
ఆకర్షి కశ్యప్ vs యు హాన్ (చైనా)

పురుషుల డబుల్స్ :
హరిహరన్ అంశకరుణన్/రూబన్ కుమార్ రెతినసబాపతి vs క్వాలిఫైయర్
పృథ్వీ కృష్ణమూర్తి రాయ్/సాయి ప్రతీక్ కె vs చీ చియు హ్సియాంగ్/వాంగ్ చి-లిన్ (చైనీస్ తైపీ)

మహిళల డబుల్స్ :
ట్రీసా జాలీ/గాయత్రి గోపీచంద్ vs క్వాలిఫైయర్
ప్రియా కొంజెంగ్‌బామ్/శ్రుతి మిశ్రా vs సంగ్ షువో యున్/యు చియెన్ హుయ్ (చైనీస్ తైపీ)

మిక్స్‌డ్ డబుల్స్ :
రోహన్ కపూర్/రుత్విక శివాని గద్దె vs యాప్ రాయ్ కింగ్/సియోవ్ వాలెరీ (మలేషియా)
సతీష్ కరుణాకరన్/ఆద్య వారియత్ vs గో సూన్ హుత్/లై షెవోన్ జెమీ (మలేషియా)
ధృవ్ కపిల/తనీషా క్రాస్టో vs హూ పాంగ్ రాన్/చెంగ్ సు యిన్ (మలేషియా)
ఆశిత్ సూర్య/అమృత ప్రముత్తేష్ vs క్వాలిఫైయర్

ఇదిలా ఉండగా, పురుషుల డబుల్స్‌లో, భారత్ కు పృథ్వీ కృష్ణమూర్తి రాయ్ – సాయి ప్రతీక్ కె తోపాటు హరిహరన్ అంసకరుణన్ – రూబన్ కుమార్ ద్వయం ప్రాతినిధ్యం వహిస్తుంది.

మిక్స్‌డ్ డబుల్స్ ఈవెంట్‌లో రోహన్ కపూర్/రుత్విక శివాని గద్దె, సతీష్ కరుణాకరన్/ఆద్య వారియత్, ధృవ్ కపిల/తనీషా క్రాస్టో, అసిత్ సూర్య/అమృత ప్రముత్తేష్ పాల్గొంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *