బాబు జగ్జీవన్ రావ్ సేవలు ఆదర్శం…

బిక్కనూర్, ఆంధ్రప్రభ ; స్వాతంత్ర సమరయోధుడు మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రావు సేవలు ఎంతో ఆదర్శమని కామారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని రామేశ్వర్ పల్లి గ్రామంలో,స్వాతంత్ర్య సమరయోధులు, భారతదేశ తొలి ఉప ప్రధాని స్వర్గీయ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళు అర్పించారు.

అనంతరం మాట్లాడుతూ… బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ఆయన ఎంతో కృషి చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చేపూరి రాణి రాజు, ఉపసర్పంచ్ వినోద్ గౌడ్, వీడీసీ అధ్యక్షులు మద్ది సూర్యకాంత్ రెడ్డి ఏఎంసి డైరెక్టర్ నాగర్తి రమేష్ రెడ్డి, రైతు సమన్వయ సమితి మాజీ డైరెక్టర్ తక్కల బాపురెడ్డి, వార్డు సభ్యులు మద్ది కృష్ణారెడ్డి,ఒడ్డే శశికుమార్, పనాసరాజు, అంబేద్కర్ సంఘం అధ్యక్షులు చేపూరి అశోక్, సభ్యులు చేపూరి అనిల్, రమేష్, సుమన్, స్వామి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply