ఉరుసులో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

కరీమాబాద్, ఆంధ్రప్రభ ; భారత ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు 40వ డివిజన్ ఉరుసులో ఘనంగా నిర్వహించారు. జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా కాంగ్రెస్ నాయకులు గడ్డం యుగంధర్ గౌడ్ హాజరై జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
పసునూరి రామన్ ఆధ్వర్యంలో జరిగిన జయంతి వేడుకలకు యుగంధర్ గౌడ్ హాజరై మాట్లాడుతూ సామాజిక సమానత్వం కోసం పోరాడిన గొప్ప మహనీయుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని ఆయన సేవలు చిరస్మరణీయమని అన్నారు. జయంతి వేడుకల్లో యూత్ నాయకులు పసునూరి రాజు గంగన్న, మల్లేశం, లింగాల రాజన్ బాబు, రాజ్ కుమార్ పసునూరి యాదగిరి, సంపత్, మంద కళ్యాణ్, జన్ను రాజు, గణేష్ తదితరులు పాల్గొన్నారు.
