Babapur | సొంతింటి కళ నెరవేరిన వేళ…

Babapur | సొంతింటి కళ నెరవేరిన వేళ…

Babapur | భీమ్‌గల్‌ రూరల్,ఆంధ్రప్రభ: భీమ్‌గల్‌ మండలంలోని బాబాపూర్ గ్రామంలో బుధవారం ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారు జంగిటి లింబాయి ఇంటి పని పూర్తి కావడంతో స్థానిక ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై స్థానిక సర్పంచ్ ఎంఏ.సమీర్ తో కలిసి గృహప్రవేశం చేశారు.ఈ సందర్భంగా ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్ నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు వరo అని, ఇందిరమ్మ ఇల్లు తో సొంత ఇంటి కల నెరవేరూతుందని ఎంపీడీవో అన్నారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సమీర్ మాట్లాడుతూ, ప్రజా పాలనలో నిరోపేద కుటుంబాలకు సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇల్లు ప్రవేశపెట్టి సంతింటి కళ నెరవేరడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తులు గ్రామ పాలకవర్గం తరఫున సీఎం రేవంత్ రెడ్డికి నియోజకవర్గం ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏఈ తేజస్, ఉప సర్పంచ్ మంద గోవర్ధన్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, గ్రామ పంచాయతీ సెక్రెటరీ, ప్రశాంత్, వార్డ్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply