SABARI | అయ్యప్ప స్వామి నామస్మరణం

SABARI | అయ్యప్ప స్వామి నామస్మరణం
పేటలో మారు మ్రోగిన అయ్యప్ప స్వామి నామస్మరణం
నారాయణపేట రూరల్, ఆంధ్రప్రభ : అయ్యప్ప మలధారణం మోక్షానికి మార్గమని 41 రోజులపాటు మాలధారణచేసి శబరి యాత్ర (Sabari Yatra) చేయడం మానవ జన్మకు సార్థకమని సీనియర్ మాలధారణ గురు స్వామి అప్పి అన్నారు శనివారం పట్టణంలోని పత్తి బజార్ అప్పి స్వామి స్వగృహంలో 3గంటలపాటు గణపతి అయ్యప్ప సుబ్రహ్మణ్య స్వామి వార్ల చిత్ర పటాలకు పూజల తోపాటు అయ్యప్ప స్వామి ఉత్సవ మూర్తి విగ్రహనికి మహా అభిషేకం పుష్పాలంకరణ పేట తుళ్లి ఆటలతో నైవేద్యం మహా మంగళ హారతి గురు స్వాములకు సత్కారించి 300 మంది స్వాములకు అన్నదానం నిర్వహించారు ఈకార్య క్రమంలో అఖిల బారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి జిల్లా అధ్యక్షులు కాకార్ల భీమయ్య ఉమాపతి లింగు కన్నయ్య అశోక్ బాబు మహేష్ మణి మొహన్ సచిన్ సత్తి తదితరులు పాల్గొన్నారు.

