వైభవంగా అయ్యప్ప పడిపూజోత్సవం..

  • పాల్గొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్

కరీంనగర్, ఆంధ్ర‌ప్ర‌భ : అయ్యప్ప స్వామి మహా పడిపూజోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. శనివారం రాత్రి కరీంనగర్ నగరంలోని మహాశక్తి ఆలయంలో నిర్వహించిన పడిపూజోత్సవ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయ్యప్ప మాలదారుల భజనలతో మహాశక్తి ఆలయం మారుమోగిపోయింది. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య పడిపూజోత్సవం ఘనంగా నిర్వహించారు. అయ్యప్ప మాలదారులతో పాటు పెద్ద సంఖ్యలు భక్తులు పాల్గొన్నారు.

Leave a Reply