Ayyappa | వైభవంగా ఇరుముడి మహోత్సవం
Ayyappa | మంగపేట, ఆంధ్రప్రభ : ములుగు జిల్లా మంగపేట (Mangapeta) మండలం బోరు నర్సాపురం గ్రామంలో అయ్యప్ప మాలదారులు ఆదివారం స్థానిక రామాలయంలో వైభవంగా ఇరుముడి కార్యక్రమం నిర్వహించారు. 41 రోజుల పాటు నియమ, నిష్టలతో కఠిన దీక్షలు చేసి, తమ కుటీరంలో ప్రతి రోజు ఉదయం, సాయంత్రం పూజలు నిర్వహించిన అయ్యప్పలు ఆదివారం ఉదయం స్వామియే శరణమయ్యప్ప అంటూ శరణు ఘోష చేస్తూ భక్తి పరవశం నడుమ వైభవముగా ఇరుముడి కార్యక్రమాన్ని కొనసాగించారు. గురు స్వాములు కున్నం వెంకటరెడ్డి, బండపెల్లి రవి, శివకేశవులు తదితరుల ఆధ్వర్యంలో అయ్యప్పలకు ఇరుముడులు కట్టారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన బంధువులు, మిత్రులతో ఆలయం ప్రాంగణ అధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

