Ayodhya Ram Mandir | రామ్ విలాస్ ఇకలేరు..

Ayodhya Ram Mandir | రామ్ విలాస్ ఇకలేరు..

Ayodhya Ram Mandir, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : రామ జన్మభూమి ఉద్యమనేత, బీజేపీ మాజీ ఎంపీ, రామ్ విలాస్ వేదాంతి (67) కన్నుమూశారు. కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన రేవా (మధ్యప్రదేశ్)లో చికిత్స్ పొందుతూ గుండెపోటుతో చనిపోయారు. వేదాంతి అంత్యక్రియలు ఈరోజు అయోధ్యలో జరగనున్నాయి. ఆయన తన జీవితాన్ని అయోధ్య ఆలయ నిర్మాణం కోసమే అర్పించారు. శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ ఎగ్జిక్యూటీవ్ ప్రెసిడెంట్ గా పని చేశారు. రెండుసార్లు ఎంపీగా గెలిచారు.

Leave a Reply