Awas plus gramin yojana Survay :  స్పీడ్​ అప్​​

Awas plus gramin yojana Survay :  స్పీడ్​ అప్​

ఇళ్ల  పన్ను వసూలు 100%   తప్పనిసరి

ఇళ్లు లేని లబ్ధిదారుల్ని గుర్తించండి నంద్యాల కలెక్టర్ రాజకుమారి  

Awas plus granim ypjana Survay

(నంద్యాల  ఆంధ్రప్రభ బ్యూరో)

జిల్లాలో  ఆవాస్ ప్లస్ గ్రామిన్ యోజన -2024  సర్వేను (Awas plus granim ypjana Survay)  వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా ఆదేశించారు. సోమవారం   పీజీఆర్ఎస్  ప్రోగ్రామ్ (PGRS)​  సందర్భంగా వివిధ అంశాలపై  అధికారులతో  సమీక్ష  నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి (Nandyala Cllector)    మాట్లాడుతూ…ప్రతి పేదవాడికి ఇల్లు నిర్మించాలన్నదే ప్రభుత్వం   ముఖ్య ఉద్దేశ్యమని  గృహనిర్మాణ శాఖ అధికారులందరూ (Housing related Officers)  సమన్వయంతో పనిచేసి ఆవాస్ ప్లస్ గ్రామిన్ యోజన -2024 (APGY) సర్వేను వేగవంతం చేయాలన్నారు.  ఈ కార్యక్రమాన్ని నవంబర్ 30వ (November 30)  తేదీ లోపల పూర్తి చేయాలన్నారు. ఆవాస్ ప్లస్ గ్రామిన్ యోజన-2024 సర్వే కార్యక్రమం జిల్లాలోని ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని మండలాలన్నీ చాలా వెనుకబడి ఉన్నాయని హౌసింగ్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని సర్వే  పూర్తి చేయాలన్నారు.

Awas plus granim ypjana Survay : అర్హుల్ని గుర్తించండి

జిల్లాలోని అర్హులైన లబ్ధిదారులకు ఇల్లు మంజూరు చేయాలంటే తప్పకుండా ఈ (House Survay) సర్వే పూర్తి చేయాలన్నారు. ఇందుకు   ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, పంచాయతీ సెక్రటరీలు, వెల్ఫేర్ అసిస్టెంట్లు, హౌసింగ్ సిబ్బంది సమన్వయంతో పనిచేసి త్వరితగతిన సర్వే పూర్తి చేయాలన్నారు. ఎంపీడీవోలు,  మండల ప్రత్యేక అధికారులు డీఎల్ పీ వో లు పంచాయతీరాజ్ ఎస్ ఈ,  ఇంజనీరింగ్ అసిస్టెంట్లు సర్వే పనులను పర్యవేక్షించాలన్నారు.

Awas plus granim ypjana Survay : నూరు శాతం పన్ను వసూలు తప్పదు

జిల్లాలో స్వర్ణ పంచాయతీలకు   2025-.. 26, సంవత్సరానికి   వచ్చే మార్చి 31వ తేదీ లోపల (House Tax)  పన్ను వసూలు చేయాలన్నారు. జిల్లాలో 3,14,652 ఇళ్లకు  నుంచి రూ. 10.51 కోట్లు   వసూలు చేయాలన్నారు. ప్రస్తుతం రూ. 9,74,000ల – పన్ను వసూలు చేసినట్టు  వివరించారు. మిగతా మొత్తం పన్ను వసూలు చేసేందుకు పంచాయతీ కార్యదర్శులు, బిల్ కలెక్టర్లు జూనియర్ అసిస్టెంట్లు, ప్రత్యేక శ్రద్ధ  తీసుకోవాలన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో పలు అంశాలపై జిల్లా కలెక్టర్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

Leave a Reply