సంగారెడ్డి, ఏప్రిల్ 16 (ఆంధ్రప్రభ): తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం, భూభారతి చట్టం -2025 అవగాహన సదస్సు గురువారం సదాశివపేట పట్టణం మండల కేంద్రంలోని దుర్గా ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేశారు. ఈ సదస్సులో ముఖ్య అతిధులుగా పాల్గొన్న టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు భూ భారతి, రెవిన్యూ అవగాహన కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వళన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి సందేశాన్ని చదివి వినిపించి ప్రారంభించారు. ఈసందర్భంగా సదస్సుకు హాజరైన రైతులకు భూ భారతి చట్టం – విది విధానాలు వివరించారు. అదనపు కలెక్టర్ (రెవెన్యూ ), మాధురి, పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ అంబదాస్ రాజేశ్వర్, రెవెన్యూ డివిజన్ అధికారి రవీంధర్ రెడ్డి, స్థానిక తహసీల్దార్ కె.సరస్వతి, రెవెన్యూ అధికారులు, వ్యవసాయ అధికారులు, రైతులు, రైతు సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.