పారిశుద్ధ్యం పరిశుభ్రతపై అవగాహన

చౌటుప్పల్, ఆంధ్రప్రభ ; చౌటుప్పల్ మండల మహిళా సమాఖ్య భవనంలో గ్రామ సంఘ అసిస్టెంట్లకు నీరు పారిశుద్ధ్యం పరిశుభ్రత కార్యక్రమం పైన తెలంగాణ మహిళా అభివృద్ధి సొసైటీ ఆధ్వర్యంలో గురువారం మహిళలకు శిక్షణ శిబిరం నిర్వహించారు.

ఈ శిక్షణ కార్యక్రమంలో భాగంగా సమాజంలో సురక్షితమైన నీరు పారిశుధ్యం పై అవగాహన పెంచడం, సభ్యుల మధ్య ఆర్థిక అడ్డంకులను తొలగించి సురక్షితమైన నీరు, పారిశుధ్యం పొందడం కోసం అందించేలా చూడడం అనే విషయం పైన శిక్షణ ఇచ్చారు.

ఈ శిక్షణా కార్యక్రమంలో డిఆర్డిఏ అడిషనల్ డి ఆర్ డి ఓ కోట జంగారెడ్డి, మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు అలివేలు, కార్యదర్శి, కోశాధికారి ఏ.పి.ఎం యాదయ్య, సీసీలు విమల, నరసింహ, కల్పన, గ్రామ సంఘం అసిస్టెంట్లు పాల్గొన్నారు.

Leave a Reply