ప్రజలకే లాభం..

  • అవగాహనకు రంగం సిద్ధం
  • శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్

శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో : ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీ పై ప్రజలకు అవగాహన కల్పించాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మారిన జీఎస్టీ పై ప్రభుత్వ శాఖల అధికారులకు అవగాహన కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తో కలసి ఆయన శుక్రవారం సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మారిన ధరల విషయంపై ప్రజలకు తెలియజేయాలన్నారు. 4 వారాల షెడ్యూల్ ను సవివరంగా ప్రజలకు వివరించాలన్నారు. ఇంటింటికి వెళ్ళి జీఎస్టీ తగ్గింపు, కలిగే సేవింగ్స్ గూర్చి ప్రజలకు తెలుపాలని ఆదేశించారు.

జీఎస్టీ పై పోస్టరు విడుదల చేసి ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. మొదటి వారం షెడ్యూల్ విడుదలైనట్లు తెలిపారు. పోస్టర్లు తయారు చేసి సచివాలయాలు, గ్రామ, మండలాల వారీగా ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎవరైనా ఎక్కువ ధరలకు విక్రయించరాదన్నారు.

జిల్లా స్థాయి సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు. జీఎస్టీ డిప్యూటీ కమిషనర్, శ్రీకాకుళం జిల్లా సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ నోడల్ ఆఫీసర్ స్వప్న దేవి మాట్లాడుతూ సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ పై కార్యక్రమం ఈ నెల 22వ తేదీన ప్రారంభమైందన్నారు.

29 వరకు జరిగే సేవింగ్స్ పై ఇంటింటికి వెళ్లి చెప్పడం, సెప్టెంబర్ 30 నుండి అక్టోబరు 6 వరకు వ్యవసాయం, ఇతర వృత్తులు, అక్టోబరు 7 నుండి 13 వరకు విద్య, లైఫ్, హెల్త్ ఇన్సూరెన్స్, ఎలక్ట్రానిక్స్, తదితరమైనవి, అక్టోబర్ 14 నుండి 18 వరకు టూరిజం, సేవా రంగం, రెన్యూబుల్ ఎనర్జీ, ఆటో మోబైల్స్, తదితరమైనవి, అక్టోబరు 19న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో దీపావళి వేడుకలతో ఒక గొప్ప ముగింపు కార్యక్రమం జరుగుతుందని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను వివరించారు.

పేద, మధ్యతరగతి వర్గాల ప్రతి కుటుంబానికి కొంత మేర డబ్బులు ఆదా అవుతాయన్నారు. వ్యాపారులకు అమ్మకాలు కూడా పెరుగుతాయన్నారు. రోజు వారీ ఉపయోగించే చాలా వస్తువులపై జీఎస్టీ 5 శాతం మాత్రమే ఉంటుందని ప్రస్తుతం రెండు శ్లాబులు మాత్రమే ఉంటాయన్నారు.

99 శాతం వస్తువులు సేవలు పన్ను రహితంగా ఉన్నాయన్నారు. లేదా 5 శాతం లేదా 18 శాతం జీఎస్టీ ని కలిగి ఉన్నట్లు వివరించారు. జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ చంద్రకళ మాట్లాడుతూ జీఎస్టీని నాలుగు శ్లాబులు నుండి రెండు శ్లాబులుగా ప్రభుత్వం తీసుకు వచ్చినట్టు చెప్పారు.

గ్రామ సచివాలయాలు, స్వయం సహాయక సంఘాలు గ్రామ స్థాయి సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. డ్వామా పీడీ సుధాకర్, డీఆర్డీయే ప్రాజెక్టు డైరెక్టర్ కిరణ్ కుమార్, డిప్యూటీ కలెక్టర్ లక్ష్మణమూర్తి, డీపీఓ భారతి సౌజన్య పాల్గొన్నారు.

ఈ సమావేశంలో ట్రెయినీ కలెక్టర్ పృథ్వీ రాజ్ కుమార్, డిప్యూటీ కలెక్టర్ డీఆర్డీయే పిడి కిరణ్ కుమార్, జిల్లా పరిషత్ సీఈవో ఎల్ఎన్ వి శ్రీధర్ రాజ, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పీవీవీడీ ప్రసాదరావు, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు డీపీవో కె. భారతి సౌజన్య, మత్స్య శాఖ జిల్లా అధికారి సత్యనారాయణ, ఆర్ఐఓ దుర్గారావు, లీగల్ మెట్రాలజీ అధికారి, నరసన్నపేట, ఆమదాలవలస, కాశీబుగ్గ అసిస్టెంట్ జీఎస్టీ అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply