Awareness | ‘అరైవ్ అలైవ్’ రహదారి భద్రతాపై అవగాహన

Awareness | కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : రహదారి నిబంధనలను పాటించడం ద్వారానే సురక్షిత ప్రయాణం సాధ్యమని కమ్మర్ పల్లి ఎస్సై జి. అనిల్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం కమ్మర్ పల్లి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం, చౌట్ పల్లి గ్రామంలో ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా రహదారి భద్రతపై ప్రజలకు, ఎంపిడివో కార్యాలయ సిబ్బందికి అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఎస్సై అనిల్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని కోరారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. వాహనం నడిపేటప్పుడు మొబైల్ ఫోన్ వాడటం ప్రమాదకరమని హెచ్చరించారు. అతివేగం ప్రాణాలకే ముప్పని,నియమిత వేగంతో ప్రయాణించాలని సూచించారు.

ప్రమాద రహిత సమాజం కోసం ప్రతి పౌరుడు సహకరించాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీడీవో రాజశ్రీనివాస్, తహశీల్దార్ జి.ప్రసాద్, కార్యాలయ సిబ్బంది,చౌట్ పల్లి గ్రామ సర్పంచ్ మహబూబ్,ఉప సర్పంచ్ విశాల్,చౌట్ పల్లి గ్రామ విడిసి అధ్యక్షులు ప్రవీణ్,పంచాయతీ కార్యదర్శి టి.శాంతి కుమార్,గ్రామ పంచాయతీ సిబ్బంది మరియు కమ్మర్ పల్లి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply