Awareness | బాల్య వివాహాలు, పోక్సోపై అవగాహన

Awareness | మునుగోడు, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఐ సి డి ఎస్ ఆధ్వర్యంలో బేటీ బచావో–బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా బాల్య వివాహాలు, పోక్సో చట్టం, మానవ అక్రమ రవాణా అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీడీపీఓ లావణ్య కుమారి మాట్లాడుతూ ఆడపిల్లలను బతకనిద్దాం, చదవనిద్దాం అనే సందేశంతో విద్యార్థులకు చైతన్యం కల్పించారు. బాల్య వివాహాలు ఆరోగ్య, విద్య, భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపుతాయని వివరించారు.

18 సంవత్సరాల లోపు పిల్లలపై లైంగిక దాడులు జరిగితే పోక్సో చట్టం కింద కఠిన శిక్షలు విధిస్తారని, 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని తెలిపారు. ఇలాంటి ఘటనలు గమనించిన వెంటనే 1098, 100, 181టోల్ ఫ్రీ నంబర్లకు సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏసీడీపీఓ వెంకటమ్మ, ప్రధానోపాధ్యాయులు బాల ప్రసాద్, సూపర్వైజర్లు ఎం.శివేష, ఎం.నాగమణి, ఉపాధ్యాయులు, అంగన్వాడీ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply