Awareness | రోడ్డు భద్రతపై అవగాహన

Awareness | నేరడిగొండ, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని రెయిన్బో పబ్లిక్ పాఠశాలలో విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల విద్యాధికారి భూమారెడ్డి, ఎస్సై ఇమ్రాన్ ఖాన్ రావడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులు చిన్నప్పటి నుండి రోడ్డు భద్రత నియమాల పై అవగాహన కలిగి ఉండాలని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థినుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో టీఆర్ ఎస్ ఎం ఎస్టేట్ అడ్వైజర్ పురుషోత్తం రెడ్డి, ఈసీ మెంబర్ స్వామి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ప్రకాష్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

Leave a Reply